News

ఎన్నడూలేని విధంగా దోచుకుంటున్నారు


టీ.పీసీసీ చీఫ్ ఉత్తమ్‌‌కుమార్‌రెడ్డి 2019లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తీరుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ శిక్షణా శిబిరంలో ఉత్తమ్ మాట్లాడుతూ ఇతర పార్టీల నేతలను ప్రలోభపెట్టి టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబం తప్ప ఎవరూ సంతోషంగా లేరన్నారు. ఎన్నడూలేని విధంగా టీఆర్‌ఎస్‌ నేతలు దోచుకుంటున్నారని ఉత్తమ్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.